మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్మాక్రోస్కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్బామ్ ప్రెస్మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో అధ్యక్షురాలితోపాటు సిబ్బంది, మీడియా అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.

