మాజీమంత్రి ఆర్కే రోజాపై రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారం పోయినా రోజాకు మదం తగ్గలేదు అని ఘాటుగా విమర్శించారు. 2024లో నగరి ప్రజలు చెప్పుతోకొట్టినట్టు బుద్ధి చెప్పినా రోజా తీరు మారలేదు అని మండిపడ్డారు. ఇంట్లో ఖాళీగా కూర్చొలేక గాలి మాటలు మాట్లాడుతోంది అని మండిపడ్డారు. నారా భువనేశ్వరిపై మాట జారితే తాట తీస్తామని మంత్రి సవిత మాజీమంత్రి రోజాకు హెచ్చరించారు.

