దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్ పై దాడుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించడం స్టాక్ మార్కెట్కు ఊతమిచ్చింది.సెన్సెక్స్ ఓ దశలో 1700 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 23 వేల మార్కును అందుకుంది.బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులోనే రూ. 7 లక్షల కోట్లు పెరిగి రూ.423 లక్షల కోట్లకు చేరింది.

