కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం జరిగింది. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని అన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని చెప్పుకొచ్చారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ నేతలకు కేసీఆర్ తెలిపారు.

