ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం సారలంకలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి దాదాపు 30 ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
అగ్నిమాపక శకటాలు.. ఘటనా స్థలానికి చేరుకునే సరికే ఇళ్లన్ని పూర్తిగా కాలిపోయాయి. దాంతో పలు కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ మంటల్లో సంక్రాంతి పండగ కోసం తెచ్చుకున్న దుస్తులు, కొత్త వస్తువులు సైతం కాలిపోయాయి. పండగ వేళ ఇలాంటి పరిస్థితి రావడంతో బాధితులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

