
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ధరాళీ గ్రామాన్ని ఖీర గంగానది వరద ప్రాంతంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి రహదారులు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతానికి రోడ్డు మార్గం ద్వారా సంబంధాలు తెగిపోయి సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రోడ్డు మార్గంలో జేసీబీలను ఘటనా స్థలికి తరలించడం సాధ్యం కాకపోవడంతో ఆర్మీకి చెందిన రవాణా హెలికాప్టర్ చినూక్ సాయంతో జేసీబీని అక్కడకు తరలించారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.