అంతర్జాతీయ సమాజం అభ్యున్నతి కోసం శాశ్వత ప్రాతిపదికన భారత్ అందిస్తున్న సహాయం తమకెంతో ముఖ్యమైందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు కీలక పాత్రను పోషించే అత్యంత సానుకూల ట్రెండ్ నడుస్తోందని ఆయన చెప్పారు. గ్లోబల్ సౌత్ దేశాల పరిధిలో తొలిసారిగా భారత్ నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ – 2026 సదస్సులో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనియో గుటెరెస్ ఈ కామెంట్స్ చేశారు.

