ఆస్ట్రేలియాలో విదేశీ దరఖాస్తుదారుల నుంచి వచ్చిన వీసా అభ్యర్ధనలను రికార్డు స్థాయిలో తిరస్కరించింది. ఆస్ట్రేలియాకు వచ్చే విద్యార్థులు నిజంగా చదువుకోవాలనుకుంటున్నారో? లేదో? నిర్ధారించుకోవడానికి అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. దీంతో దాదాపు 40% మంది భారతీయుల దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నారు ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసా ఫ్రేమ్‌వర్క్ కింద భారతీయ దరఖాస్తుదారులను ఎవిడెన్స్ లెవల్ 2 (EL2) నుంచి ఎవిడెన్స్ లెవల్ 3 (EL3)కి మార్చారని, దీనివల్ల విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు కూడా పెరుగుతాయని కేంద్రం రాజ్యసభకు తెలియజేసింది.

