
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9వ తేదీన ఈ టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడొద్దని డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడవద్దని బిసిసిఐపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, బిసిసిఐ దీనిపై ఇప్పటివరకూ రియాక్ట్ కాలేదు. అయితే కొద్ది రోజుల క్రితం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశంతో భారత్ ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని.. కేవలం మల్టీ నేషనల్ సిరీస్‌లలో పాకిస్థాన్‌తో తలపడుతుందని కేంద్రం నిర్ణయించింది.