భారత్ వద్ద కేవలం 25 రోజులకే సరిపడే ఆయిల్ నిల్వలు మాత్రమే ఉన్నాయని వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ సమాచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, భారత్ వద్ద సుమారు 4,000 కోట్ల లీటర్లకు సమానమైన దాదాపు 250 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వలు దేశ అవసరాలను పూర్తిస్థాయిలో 7 నుంచి 8 వారాల వరకు తీర్చగలవని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలను ప్రభుత్వం హెచ్చరించింది.

