ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బుధవారం దిల్లీలోని 10 జన్‌పథ్‌లోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో బాధితురాలితో రాహుల్ మాట్లాడారు. బాధితురాలితో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రంగా మండిపడిన రాహుల్, అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ వచ్చిందని, బాధితులనేమో నేరస్థులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. భారత్ డెడ్ ఎకానమీ కాకుండా డెడ్ సొసైటీగా మారిపోతుందని ఆరోపించారు.

