
రష్యాతో భారత్ చమురు బంధమే.. న్యూఢిల్లీతో చర్చల్లో తమకు చికాకు తెప్పించే అంశమని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో అన్నారు. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్కు చమురు చౌకగా లభిస్తోంది. దీంతో న్యూఢిల్లీ తమ అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురును తక్కువ ధరకు కొనుగోలు చేస్తోంది. దురదృష్టవశాత్తూ భారత్ చమురు కొనుగోలు వల్లే రష్యాకు నిధులు సమకూరుతున్నాయి. ‘రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లే ఉక్రెయిన్లో
మాస్కో యుద్ధ ప్రయత్నాలను నిలబెట్టడానికి సాయపడుతోంది.