
భారతదేశంలో కోవిడ్ -19 కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మరోసారి దేశంలో కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. జూన్ 7తేదీ ఉదయం 8 గంటల వరకు దేశంలో 5,755 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే గత 24 గంటల్లో కరోనాతో నలుగురు మరణించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఏపీలో ప్రస్తుతం 72 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో 9 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.