అగ్రశ్రేణి ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ భారత విపణిలో మరో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. 2030 నాటికి మొత్తం 35 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ స్మభవ్ సమ్మిట్ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట అమిత్ అగర్వాల్ ప్రకటించారు. ఆ పెట్టుబడి ద్వారా దేశంలో డిజిటలైజేషన్, AI ఆధారిత సాంకేతిక అభివృద్ధి, ఎగుమతుల పెంపు, వచ్చే ఆరు సంవత్సరాల్లో మరో 10 లక్షల డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్, సీజనల్, ఇండ్యూస్డ్ జాబ్స్ సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

