
న్యూయార్క్ మేయర్ పదవి కోసం పోటీపడుతున్న వారిలోభారత సంతతికి చెందిన వామపక్ష సోషలిస్ట్ జోహ్రాన్ మమ్దానీ ఉన్నారు. దీంతో ట్రంప్ ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జోహ్రాన్ మమ్దానీ పై ట్రంప్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. మమ్దానీ “భయంకరంగా కనిపిస్తున్నాడు, అతని గొంతు గజిబిజిగా ఉంది, అతను అంత తెలివైనవాడు కాదు, డమ్మీస్ అందరూ అతనికి మద్దతు ఇస్తున్నారు. ఇది మన దేశ చరిత్రలో ఒక గొప్ప క్షణం!” అని సెటైరిక్‌గా వ్యాఖ్యలుచేస్తున్నారు.