
ఓపెన్ ఏఐ తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్‌ను రూపొందించడానికి బ్రాడ్‌కామ్‌తో కలిసి పని చేయబోతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా NVIDIA చిప్‌లు ఆధిపత్యం చూపిస్తుండుగా NVIDIAపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఓపెన్ ఏఐ ప్రయత్నిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఓపెన్ ఏఐ, ChatGPT వంటి AI మోడళ్ల కోసం అవసరమయ్యే ప్రాసెసింగ్ శక్తిని తన సొంత చిప్ ద్వారా స్వయంగా అందించాలనుకుంటోంది. తద్వారా NVIDIA వంటి పెద్ద చిప్ తయారీదారులపై ఆధారపడకుండానే AI సిస్టమ్‌లను నడిపించాలని ప్లాన్ వేసింది.