సినీ నటుడు రానా దగ్గుబాటి హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. ఇంతకు ముందే సీఐడీ సిట్ విచారణకు యాంకర్ విష్ణుప్రియ సైతం హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రచారానికి సంబంధించి విష్ణుప్రియను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను సిట్ అధికారులు విచారణ చేశారు. ఇటీవల విజయ్‌దేవరకొండ, ప్రకాశ్‌రాజ్‌ను సిట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

