్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు ఏపీ, తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు జారీ చేసిన నోటీసులు మేరకు.. విష్ణుప్రియ, రీతూ చౌదరి గురువారం విచారణకు హాజరయ్యారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయని రీతూ చౌదరి పేర్కొంది. అలాగే, విష్ణుప్రియ స్టేట్మెంట్ని సైతం పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్‌ని సైతం పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. త్వరలోనే మిగతా వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు సమాచారం.

