
విజయవాడలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలోని ఓ బిల్డింగ్లో కరెంట్ షాక్ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి కరెంట్ షాక్ కొట్టడంతో కాపాడబోయి మిగతావారు సైతం విద్యుదాఘాతానికి గురయ్యారా.. లేక ముగ్గురికి అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో ప్రాణాలు కోల్పోయారా తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు.
- 0 Comments
- Ntr District