పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చే దిశగా ఉందని వోట్వైబ్ వెల్లడించింది. ఈ ప్రీ-ఎలక్షన్ సర్వే ప్రకారం, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ 294 సభ్యుల అసెంబ్లీలో 184 నుంచి 194 స్థానాలు గెలుచుకునే అవకాశముంది. ప్రతిపక్ష బీజేపీకి 98 నుంచి 108 స్థానాలు వచ్చే అవకాశముండగా ఓట్ల శాతంలో కూడా టీఎంసీ సర్వే ప్రకారం 41.9 శాతం మంది టీఎంసీకి మద్దతు ఇవ్వగా, 34.9 శాతం మంది బీజేపీకి మద్దతు తెలిపారు.

