
బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ఒడిశాకు చెందిన వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం రాత్రి క్యాంపస్‌కు వచ్చే సమయంలో యువతి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అయితే ముగ్గురు వ్యక్తులు దగ్గరకు వచ్చే సమయంలో ఆమెతో పాటు ఉన్న ఫ్రెండ్ అక్కడి నుంచి పారిపోయినట్టుగా చెబుతున్నారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. క్యాంపస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది.