ఎన్నికల సంఘాన్ని కలిసి అతి తక్కువ సమయంలో ఎన్నికల జాబితాను సవరించడంతో వచ్చే సమస్యలపై సందేహాలు లేవనెత్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. కానీ ఎన్నికల సంఘం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి వివరణ
రాకపోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. బీహార్ ఎన్నికల సంఘం కేవలం పోస్టాఫీస్‌లా పనిచేస్తున్నదని, తమ సందేహాలకు సమాధానం ఇచ్చే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర లేదని విమర్శించారు.

