
<span;>జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ప్రస్తుతం తన పార్టీ జన్ సురాజ్ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేశారు. పార్టీ మంచి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని ప్రకటించడం సంచలనంగా మారింది.