
మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. మహాఘట్బంధన్ కూటమిలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తన పార్టీకి ఆరు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఒవైసీ తన ఎన్నికల ప్రచారాన్ని ‘సీమాంచల్ న్యాయ యాత్ర’ పేరుతో ప్రారంభించారు. యాత్రను బీహార్లోని కిషన్గంజ్ పట్టణంలో ప్రారంభించిన ఆయన, ప్రజల మధ్య పార్టీ సిద్ధాంతాలను వివరించారు.