జోగులాంబ గద్వాల : జిల్లాలోని అల్లంపూర్ తాలూకా ఎర్రవల్లి మండలం ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ బి.ఎం.సంతోష్ సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, వంటశాల సిబ్బందిపై సరైన
పర్యవేక్షణ లేకపోవడంతో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాములు విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఘటనపై సమగ్ర పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. ముందస్తు లిఖిత అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లకూడదని స్పష్టం చేశారు.

