పురూలియాలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీల ఇష్టమైన ఆహారమైన చేపలు, మాంసం, గుడ్లు తినకుండా ఆంక్షలు విధిస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్ ప్రజల సెంటిమెంట్ అయిన ‘మాచ్-భోత్’ (చేపలు-అన్నం) సంస్కృతిని దెబ్బతీసేందుకు కాషాయ పార్టీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆదివాసీలపై దోపిడీ జరుగుతోందని, మహిళలపై దాడులు పెరుగుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. బెంగాల్ కల్చర్‌తో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పారు.

