తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై బీజేపీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని… అప్పుడు పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభ, మంచిర్యాలలో రోడ్ షోలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

