
ప్రముఖ తమిళ నటి కస్తూరి బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆధ్వర్యంలో ఆమె కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు ట్రాన్స్జెండర్ కార్యకర్త, నామిస్ సౌత్ క్వీన్ ఇండియా అధ్యక్షురాలు నమిత మారిముత్తు కూడా బీజేపీలో చేరారు. తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న కస్తూరి గత కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.