
బిహార్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలు వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో 85 వేల కొత్త ఓట్లు నమోదైతే, వాటిపై కేవలం రెండు అభ్యంతరాలు మాత్రమే వచ్చాయని కోర్టు వెల్లడించింది. ఓటరు జాబితాలో తమ పేరు లేకపోతే, దానిపై సంబంధిత ఓటర్లే నేరుగా ఫిర్యాదు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఓటరు జాబితాలో పేరు ఉన్నా, ఓటు వేయలేని పరిస్థితి వస్తే, అప్పుడు మాత్రమే రాజకీయ పార్టీల సహాయం తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.