
బిహార్ రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యను వెల్లడించానికి రెండు రోజుల ముందే కేంద్ర ఎన్నికల సంఘం వడబోతను వేగవంతం చేసింది. ప్రధానంగా రెండు అంశాలను ప్రమాణికంగా తీసుకొని 52 లక్షల ఓటర్లను తొలగించింది. చనిపోయిన, ఇతర నియోజక వర్గాలకు వలస వెళ్లిన వాళ్ల పేర్లను మాత్రమే జాబితా నుంచి తప్పించామని సీఈసీ వెల్లడించింది. రద్దు చేసిన 52 లక్షల మంది ఓటర్లలో 18 లక్షల మంది చనిపోయినవాళ్లు కాగా.. 26 లక్షల మంది ఇతర నియజకవర్గాలకు వలస వెళ్లిన వారు ఉన్నారు.