
బిసి రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను తమ ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తామని పేర్కొన్నారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసే యోచనలో ఉన్నామని అన్నారు. ఇప్పటివరకు మూడు చట్టాలు, ఒక ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.