వరి వేస్తే.. ఉరే అని చెప్పి పంట కొనేది లేదన్న నేత మళ్లీ రావాలా అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వాస్తు బాగా లేదని బాగున్న సచివాలయం కూల్చి కొత్తగా కట్టుకున్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి.. ఇలా తలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచన మాత్రం వాళ్లకు ఏనాడూ రాలేదు. దొరల గడీల ముందు పేదలు ఊడిగం చేస్తూ ఉండాలని భావించారు’’ అని విమర్శించారు.

