
అలనాటి హిందీ, మరాఠీ చిత్రాల ప్రముఖ నటి సంధ్యా శాంతారామ్ కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆమె శనివారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 94. సంధ్యా శాంతారామ్..
భారతీయ చలనచిత్ర దిగ్గజ దర్శకుడు, నిర్మాత అయిన దివంగత వి. శాంతారామ్ సతీమణి. 1950, 60లలో, ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే’ ,‘దో ఆంఖే బారా హాత్’, ‘నవరంగ్’, ‘పింజ్రా’ వంటి చిరస్మరణీయమైన చిత్రాల్లో తన నటన, నృత్య కౌశలంతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు.