
మెగాస్టార్ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై బాలయ్య వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు అండగా నిలుచుంది, అధికారంలోకి రావడానికి అహర్నిశలూ కృషి చేసింది మెగా కుటుంబమే. కానీ ఈ విజ్ఞత మరిచి, అధికార మదం తలకెక్కించుకున్న బాలకృష్ణ చట్టసభల్లో సైతం చిరంజీవి గారి ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడేందుకు తెగించారు. బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం’ అని అఖిల భారత చిరంజీవి యువత ప్రకటనలో పేర్కొంది.