వైసీపీ నాయకులకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాస్ వార్నింగ్ ఇచ్చారు. బాలయ్య అభిమానిగా చెబుతున్నా.. ఆయన జోలికొస్తే.. చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. హిందూపురంలో కొందరు వెధవలు బాలయ్య గురించి మాట్లాడారని.. అందుకే ఆవేశంలో వైసీపీ కార్యాలయంపై మావాళ్లు దాడి చేశారని తెలిపారు. అదే బాలయ్య జొలికొస్తే చర్మం ఒలిచేస్తామని హెచ్చరించారు. మీకు, మీ అధినేతకు కూడా ఇదే వార్నింగ్ అని చెప్పుకొచ్చారు.

