
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అసెంబ్లీ వేదికగా సైకో అని.. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. “శ్రీ శ్రీ శ్రీ నందమూరి బాలకృష్ణ.. ప్రపంచంలోనే అతి పెద్ద సైకో..కావాలంటే సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తా!” అంటూ అంబటి రాంబాబు ఎక్స్ పోస్ట్‌ను వైసీపీ శ్రేణులు తెగ వైరల్ చేస్తున్నారు. దయచేసి ఆ సర్టిఫికెట్ ఏంటో అప్ లోడ్ చేయండి.. ఎవరు సైకోనో తెలుసు అంటూ అంబటి రాంబాబు పోస్ట్‌కు తెలుగుదేశం కార్యకర్తలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.