ఇథియోపియాలో ఉన్న హైలీ గుబ్బి అగ్నిపర్వతం వేల సంవత్సరాల తర్వాత బద్దలైంది. ఈ అగ్నిపర్వతం బద్దలుకావడంతో భారీ బూడిద, పొగ భారత వైమానిక రూట్ల వైపు కదులుతున్నట్లు ముందస్తు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత డీజీసీఏ అత్యవసర సూచనలు జారీ చేసింది. విమానయాన సంస్థలు అప్రమత్తమైన వెంటనే తమ రూట్లను మార్చుకోవాలని ఆదేశించింది. అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద మేఘాలు సోమవారం రాత్రి భారత వాయువ్య రాష్ట్రాలపై ప్రభావం చూపనున్నాయి.

