
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి వివాదంలో చిక్కకున్నది. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలు చేపట్టకుండా నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. యూనస్ తాలిబన్ పాలన తరహా ఆదేశాలపై మండిపడుతున్నారు. చీరలు, సల్వార్ కమీజ్ సహా ఒళ్లంతా కప్పి ఉండేలా దుస్తులు ధరించాలని ఆదేశించింది. మహిళలు హెడ్‌స్కార్ఫ్, హిజాబ్ ధరించాలని, ఫార్మల్ షూస్, శాండల్స్ ఉపయోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.