
జమ్మూకశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటికే పాక్- ఇండియా ఎల్‌వోసీ వెంబడి భారీగా బలగాలను రెండు దేశాలు మోహరించాయి. ఇక భారత్ ప్రతికారం గట్టిగా తీర్చకోబోతుందని గమనించిన పాకిస్తాన్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్మీ దళాలను బంకర్లలోకి వెళ్లిపోవాలని వాళ్ల ఆర్మీ చీఫ్ సూచించాడు. యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ప్రముఖులు దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితులు చూస్తుంటే.. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్దవాతావరణం నెలకొనబోతోందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.