మధ్యప్రదేశ్ లో ఫోన్ పాస్ వర్డ్ విషయంలో తలెత్తిన వివాదం చివరకు భార్య హత్యకు దారితీసింది. రేవా జిల్లాలో లౌవా గ్రామానికి చెందిన దీపక్ మిశ్రాను తన భార్య శిఖా మిశ్రా ఫోన్ పాస్ వర్డ్ అడిగింది. దీంతో ఆగ్రహానికి గురైన దీపక్ “నీ ఫోన్ పాస్ వర్డ్ ఇవ్వవు కానీ.. నా ఫోన్ పాస్ వర్డ్ కావాలా” అంటూ పిల్లల ముందే భార్యపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన శిఖ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

