
సోషల్ మీడియాలో భారత ఆర్మీకి చెందిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆ వీడియోలో..పాకిస్తాన్‌తో యుద్ధంలో ఇండియా ఆరు ఫైటర్ జెట్లు, 250 మంది సైనికులను కోల్పోయిందని ఒప్పుకున్నట్లుగా ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ (PIB ఫ్యాక్ట్ చెక్) యూనిట్ఈ క్లిప్ AI ద్వారా సృష్టించారనీ, జనరల్ ఉపేంద్ర ద్వివేది అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని కన్ఫర్మ్ చేసింది.డీప్‌ఫేక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోను డిజిటల్‌గా మార్చారు.