కర్నూలు జిల్లా చిన్నటేకురు గ్రామ సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై అసత్య ప్రచారం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సీవీ రెడ్డి, ఆరే శ్యామల, 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత వైసీపీ నేతలు, సోషల్ మీడియా ద్వారా ‘బెల్ట్ షాపుల్లో విక్రయించే కల్తీ మద్యం వల్లే ప్రమాదం జరిగింది’ అని ప్రచారం చేశారు. బి. తాండ్రపాడుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు కర్నూలు తాలుకా అర్భన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

