రూ.100 కోట్లు పెట్టి మనువడితో ఫుట్బాల్ ఆడడానికి డబ్బులు ఉంటాయి కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉండవా..? అని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘాటుగా విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ను అర్హులైన పేద ప్రజలకు పంపిణీ చేయాలని..అలాగే నిర్మాణంలో ఉన్న 248 ఇండ్లను పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద లబ్దిదారులతో కలిసి శనివారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

