అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా స్పందించారు. బీజేపీ విజయాలపై స్పందిస్తూ చంద్రబాబు.. ఈరోజు ఎన్డీఏ సాధించిన విజయం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపైనా, వికసిత భారత్ కోసం ఆయనకున్న దార్శనికతపైనా ప్రజలకు ఉన్న నిరంతర, పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. చంద్రబాబు పొరుగున ఉన్న తమిళనాడలో తాను ప్రచారం చేసినా బీజేపీ కూటమి రెండో స్ధానంలో నిలిచి విజయ్ పార్టీ గెలుస్తున్నా స్పందించలేదు.

