తమిళనాడు రాజధాని చెన్నైలోని కరూర్‌లో రైలు ప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం ఒక గూడ్స్ రైలు ప్రైవేట్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉండగా.. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కరూర్‌లోని వెల్లియనాయ్ సమీపంలో ప్రైవేట్ బస్సును వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. బస్సును డ్రైవర్ రైల్వే ట్రాక్‌ను దాటిస్తుండగా.. రైలు ఢీకొట్టడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. గాయపడిన విద్యార్ధులను కరూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

