బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)లో భారత షూటర్లు మరో స్వర్ణ పతకాన్ని మన ఖాతాలో చేర్చారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో ప్రాంజలి ధూమల్/అభినవ్ దేశ్వాల్ ద్వయం పసిడి దక్కించుకుంది. ఫైనల్లో ప్రాంజలి జోడీ 16-6తో చైనీస్ తైపీ జంట యా జు కావో -మింగ్ జుయి సూను చిత్తుచేసి విజేతగా నిలిచింది. 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో కుశాగ్రసింగ్ రజావత్ కాంస్యం పతకాన్ని అందించాడు. ఇప్పటిదాకా టోర్నీలో భారత షూటర్లు మొత్తం 11 పతకాలు కొల్లగొట్టారు.

