
అస్సాం సంగీత ప్రపంచంలో అగ్రగామిగా నిలిచిన జుబీన్ గార్గ్ మరణం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనసంద్రం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద అంత్యక్రియల గ్యాదరింగ్‌గా దీనిని గుర్తించారు. మైఖేల్ జాక్సన్, పోప్ జాన్ పాల్ II, క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ఇంతటి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక కళాకారుడి అంతిమ వీడ్కోలు కార్యక్రమానికి హాజరవడం విశేషమని లిమ్కా బుక్ పేర్కొంది.