భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం… తాజా మరో మెట్టు పైకి ఎక్కింది. జపాన్ను అధిగమించి భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం భారత్ కన్నా అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే భారత్ కంటే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు.

