దక్షిణ గోవాలోని కెనకోనా తాలూకా, పార్తగాలి గ్రామంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తం మఠంలో 550వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని 77 అడుగుల ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం కావడం విశేషం. ఈ విగ్రహం మొత్తం 77 అడుగుల ఎత్తు ఉంది. దీనిని పూర్తిగా కాంస్య లోహంతో తయారు చేశారు. ఇందులో శ్రీరాముడు ధనుస్సు, బాణం పట్టుకుని ఉన్న పౌరాణిక యోధుడి రూపంలో దర్శనమిస్తారు.

