ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒమన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ చెవికి ఒక రింగ్ లాంటి పరికరం కనిపించింది. అది ఏంటి అని నెటిజన్లు.. సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే అది ఒక ట్రాన్స్‌లేషన్ పరికరం అని తేలింది. అంటే ప్రధాని మోదీతో మాట్లాడేవారు ఏ భాష మాట్లాడినా అది ఆయనకు అర్థం అయ్యే భాషలో వినిపించే పరికరం. అది ఒక రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్ ఇయర్‌పీస్ అని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

